Random Posts

ధర్మ రక్షణ కోసం ఎన్నికల బరిలో – మీ ఆశీర్వాదమే మా బలం – తుంగా శ్రీ

Tunga Sree

ధర్మ రక్షణ కోసం ఎన్నికల బరిలో
మీ ఆశీర్వాదమే మా బలం – తుంగా శ్రీ


ధర్మం కేవలం గ్రంథాల్లో నిలిచిపోవాల్సిన సిద్ధాంతం కాదు.
అది మన జీవన విధానం. అది మన సంస్కృతి, మన ఆత్మగౌరవం.

ఈ రోజుల్లో ధర్మం ప్రశ్నార్థకంగా మారింది.
సనాతన విలువలను అవహేళన చేయడం ఫ్యాషన్‌గా మారింది.
ధర్మాన్ని రక్షించాల్సిన పాలకులే మౌనంగా ఉండటం, కొందరు దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం మనం చూస్తున్న కఠిన వాస్తవం.

అలాంటి సమయంలో
“ధర్మాన్ని కాపాడటానికి రాజకీయాల్లోకి రావడం సరైన మార్గం”
అనే నమ్మకంతోనే నేను సన్నిహితుల సూచనలతో ఎన్నికల బరిలోకి అడుగుపెడుతున్నాను.

నేను పదవుల కోసం కాదు,
ప్రతిష్ఠ కోసం కాదు,
వ్యక్తిగత లాభాల కోసం అసలు కాదు.
👉 ధర్మ రక్షణ కోసం.
👉 మన సంస్కృతి పరి రక్షణ కోసం.
👉 మన భవిష్యత్ తరాలకు విలువలతో కూడిన సమాజాన్ని అందించేందుకు.

ధర్మాన్ని కాపాడేవాడు ఒంటరివాడు కాదని,
ప్రతి ఓటరు అతని వెనుక నిలబడితే,
అధర్మానికి రాజకీయ శక్తి ఉండదు తెలియపరుచుటకు.
ఎన్నికల్లో నిలబడుతున్నాను.

ఈ ఎన్నికలలో నిలబడుట ముఖ్య ఉద్దేశ్యం
👉 ఇది ఒక సందేశం.
👉 ఇది ఒక సంకల్పం.

మీ ఒక్క ఓటు
👉 సుపరిపాలనకు దగ్గరౌవుతుంది.
👉 ధర్మానికి రక్షణగా మారుతుంది.
👉 నిజాయితీ గల నాయకత్వానికి బలంగా నిలుస్తుంది.

నన్ను ఆశీర్వదించండి.
సుపరిపాలన, దేశ, ధర్మం కోసం నిలబడుతున్న ఈ ప్రయత్నానికి మీ మద్దతు ఇవ్వండి.

ఎన్నికల్లో
👉 ధర్మం గెలవాలి.
👉 నిజాయతీ నిలవాలి.

ధర్మో రక్షతి రక్షితః
ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనలను రక్షిస్తుంది.

ధర్మం కోసం నిలబడుతున్నాను – మీ ఆశీర్వాదం ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటున్నాము

– మీ సేవకుడు
తుంగా శ్రీ

📷 Blog లో ఏదైనా image మీద click చేయండి — క్రాప్ బటన్ కనిపిస్తుంది.
✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview