ధర్మం అంటే ఏమిటి?
ధర్మం అంటే ఆద్యాత్మికం కు స సంబంచినది మాత్రమే కాదు.
ధర్మం అంటే :–
- న్యాయంగా పాలించడం
- ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉండటం
- బలహీనుల రక్షణ
- అవినీతి లేని వ్యవస్థ
- సత్యానికి కట్టుబడి ఉండటం
రామరాజ్యం అంటే దేవాలయాల సంఖ్య కాదు, ప్రజలకు న్యాయం లభించిన పాలన. కృష్ణుడు రాజకీయాల్లోకి వచ్చాడంటే అధికారం కోసం కాదు, అధర్మాన్ని నశింపజేయడానికి.
నేటి రాజకీయాల్లో ధర్మం పరిస్థితి
నేటి రాజకీయాల్లో చాలా చోట్ల ధర్మం ఒక ఎన్నికల ఆయుధంగా మారింది.
- ఓట్ల కోసం దేవుడి పేరు
- కానీ పాలనలో ధర్మం శూన్యం
ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే ధర్మం మౌనం వహిస్తుంది. ప్రజల సమస్యలు, న్యాయం, అవినీతి నిర్మూలన వంటి అంశాలు పక్కకు నెట్టబడతాయి. ఇది ధర్మానికి అవమానం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం.
ధర్మం కోసం రాజకీయం అంటే ఏమిటి?
ధర్మం కోసం రాజకీయం అంటే :–
- అధికారమే లక్ష్యం కాదు, సేవే లక్ష్యం
- పదవి కాదు, బాధ్యత ముఖ్యం
- గెలుపు కోసం అబద్ధాలు కాదు, సత్యం కోసం త్యాగం
- కుల విభజన కాదు, ధర్మ ఆధారిత ఐక్యత
ధర్మం కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు ఓటమిని కూడా గౌరవంగా స్వీకరిస్తాడు. ఎందుకంటే అతని లక్ష్యం కుర్చీ కాదు – మార్పు.
చరిత్ర మనకు చెప్పే పాఠం
భారత చరిత్రలో గొప్ప పాలకులందరూ ధర్మాన్ని రాజకీయాలకు పునాది చేసుకున్నారు.
- అశోకుడు యుద్ధం తర్వాత ధర్మ పాలనను ఎంచుకున్నాడు
- శివాజీ మహారాజ్ రాజ్యాన్ని ధర్మంతో నడిపాడు
వీరెవ్వరూ ధర్మాన్ని వాడుకోలేదు – ధర్మానికి సేవ చేశారు.
ధర్మం లేని రాజకీయాల ఫలితం
ధర్మం లేని రాజకీయాలు చివరకు –
- అవినీతిని పెంచుతాయి
- అన్యాయాన్ని బలపరుస్తాయి
- సమాజాన్ని విభజిస్తాయి
- ప్రజల్లో నమ్మకాన్ని చంపుతాయి
ఇలాంటి రాజకీయాలు దేశాన్ని ముందుకు నడిపించలేవు. తాత్కాలిక లాభాలు రావచ్చు, కానీ దీర్ఘకాలంలో విధ్వంసమే మిగులుతుంది.
ప్రజల బాధ్యత
ధర్మం కోసం రాజకీయం రావాలంటే ప్రజలు కూడా మారాలి.
- ధర్మం మాట్లాడే నాయకుడిని ఓడిస్తే
- డబ్బు, మద్యం పంచే నాయకుడిని గెలిపిస్తే
- నిజాయితీ కన్నా జాతి, కులం, మతం చూసి ఓటేస్తే
ధర్మ రాజకీయాలు ఎలా వస్తాయి?
ప్రజలు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న:
“ఈ నాయకుడు సమాజ భవిష్యత్తు ఎలా కాపాడతాడు?”
ముగింపు
ధర్మం రాజకీయాలకు అలంకారం కాదు – పునాది.
రాజకీయం ధర్మానికి సేవకుడిగా ఉండాలి, యజమానిగా కాదు.
రాజకీయం కోసం ధర్మం కాదు –
ధర్మం కోసం రాజకీయం.
ఇదే భారతదేశానికి కావాల్సిన కొత్త రాజకీయ దిశ.
ఇదే నిజమైన దేశభక్తి.
ఇదే ధర్యం యొక్క ఆత్మ.
- తుంగా శ్రీ