మన సంస్కృతి మన శ్వాస, దాన్ని కాపాడటం మన బాధ్యత - తుంగా శ్రీ

Our culture is our breath

మనిషి జీవించడానికి శ్వాస ఎంత అవసరమో, అదే విధంగా ఒక సమాజం నిలబడటానికి సంస్కృతి చాలా ముఖ్యమైనది. సంస్కృతి అంటే మన ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు, భాష, వేషభూషలు, మన జీవన విధానం మొదలగునవన్నీ కలిపి మన సంస్కృతి అవుతుంది. ఇవి మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన అమూల్యమైన సంపద.

మన సంస్కృతి మనకు ఒక గుర్తింపును ఇస్తుంది. మనం ఎవరం, ఎక్కడి వారు అన్నది ప్రపంచానికి తెలియజేసేది సంస్కృతే. ఉదాహరణకు, మన సనాతన ధర్మమూ పండుగలు, భోజన పద్ధతులు, పెద్దలను గౌరవించడం మొదలగునవి మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇవి మనలో మంచి విలువలను పెంచుతాయి.

ఇప్పుడు ఆధునిక యుగంలో చాలామంది పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తూ, మన సంప్రదాయాలను మర్చిపోతున్నారు. ఇది మంచిది కాదు. కొత్త విషయాలు నేర్చుకోవడం అవసరం అయినా, మన మూలాలను వదిలిపెట్టకూడదు. మన భాషను మాట్లాడటం, పండుగలను జరుపుకోవడం, పెద్దలను గౌరవించడం మొదలగునవి మన బాధ్యత.

సంస్కృతి కాపాడటం అంటే కేవలం పండుగలు జరుపుకోవడం మాత్రమే కాదు, మంచి విలువలను పాటించడం కూడా. నిజాయితీ, గౌరవం, సహాయం చేయడం వంటి గుణాలు మన సంస్కృతిలో భాగం. ఇవి మన జీవితాన్ని సంతోషంగా, సమాజాన్ని శాంతిగా ఉంచుతాయి.

మొత్తానికి, మన సంస్కృతి లేకపోతే మనకు ప్రత్యేకత ఉండదు. అందుకే దాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. మనం ఈరోజు దాన్ని సంరక్షిస్తే, రాబోయే తరాలకు మంచి వారసత్వాన్ని అందించగలం.

- తుంగా శ్రీ
📷 Blog లో ఏదైనా image మీద click చేయండి — క్రాప్ బటన్ కనిపిస్తుంది.
✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview